More languages

Machine translation by Google, for convenience only. It may contain errors; the English and Telugu pages are the reliable versions.

ప్రజలను చైతన్య పరిచే వ్యూహకర్తలు సమాజానికి అవసరం

ప్రస్తుత సమాజంలో రాజకీయ పార్టీలకు మనుగడ కష్టసాధ్యమైనపుడు, ప్రజల ఆదరాభిమానాలు పొందలేము అన్న స్థితిలో రాజకీయ పార్టీలు వ్యూహకర్తలను నియమించుకుని మరొకమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తాయి.

అసలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తలు ఎందుకు? ప్రజలే ఎజెండాగా, ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమమే తమ ధ్యేయంగా ముందుకు వెళితే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలు ఆమోదిస్తారు, తన భుజాన వేసుకుని సునాయాసంగా గెలుపు గుర్రాన్ని ఎక్కిస్తారు… భారతదేశ 75 సంవత్సరాల కాలంలో ఏ రాజకీయ పార్టీలు అయితే ప్రజల పక్షాన నిలబడతాయని, ప్రజల అభీష్టాన్ని నెరవేర్చి, ప్రజలను కంటికి రెప్పలా కాపాడతాయని భావించారో వాటిని మాత్రమే ప్రజాక్షేత్రంలో తిరుగులేని రాజకీయ శక్తులుగా ప్రజలు నిలబెట్టుకున్నారు. కానీ ప్రస్తుత రాజకీయాలు అందుకు భిన్నంగా ఉండడమే రాజకీయ వ్యూహకర్తల పుట్టుకకు కారణం అవుతుంది.

రాజకీయ వ్యూహకర్తలు రాజకీయ పార్టీల వైపు కాకుండా ప్రజలను చైతన్య పరిచే దిశగా ఆలోచిస్తే దేశంలోనూ మరియు రాష్ట్రాలలోనూ సుపరిపాలనను అందజేసే రాజకీయ నాయకులను ప్రజలు ఎన్నుకోగలుగుతారు… ఒక విజ్ఞానవంతుడైన వ్యూహకర్త ఉండాల్సింది ప్రజల పక్షాన… సామాన్య ప్రజలకు ఎటువంటి రాజకీయ నాయకులను ఎన్నుకోవాలో, రాజ్యాంగ పరంగా వచ్చిన ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకుని తన భవిష్యత్తును నిర్ణయించుకునే దిశగా ఎలా అడుగులు వేయాలో తెలియజేయాలి.

సామాన్య ప్రజలు ఎప్పుడైతే రాజ్యాంగం కల్పించిన హక్కులను తమకు తాముగా సునాయాసంగా పొందగలుగుతారు, ఆరోజు నవ భారతావనికి నాంది పడటం తప్పదు. అంతవరకూ సామాన్య ప్రజల పక్షాన పోరాడుదాం, నవ సమాజ భారతావనిని నిర్మిద్దాం.

జై భారత్

వినయ్ కుమార్ గట్టు

హై కోర్ట్ అడ్వకేట్ – తెలంగాణ.

Was this article helpful?

Frequently asked questions

  1. రాజకీయ పార్టీలు వ్యూహకర్తలను ఎందుకు నియమించుకుంటాయి?

    ప్రజల ఆదరణ పొందలేని స్థితిలో, మరోసారి అధికారంలోకి రావడానికి పార్టీలు వ్యూహకర్తలను నియమించుకుంటాయి. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసే పార్టీలను ప్రజలు స్వయంగా ఆదరిస్తారు; ప్రస్తుత రాజకీయాలు అందుకు భిన్నంగా ఉండటమే వ్యూహకర్తల పుట్టుకకు కారణమని ఈ వ్యాసం అభిప్రాయపడుతుంది.

  2. వ్యూహకర్తలు ఎవరి పక్షాన ఉండాలి?

    రాజకీయ పార్టీల పక్షాన కాకుండా ప్రజల పక్షాన ఉండాలి. ఎలాంటి నాయకులను ఎన్నుకోవాలో, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో ప్రజలను చైతన్యపరచాలి.

  3. ప్రజలు చైతన్యవంతులైతే ఏం మారుతుంది?

    ప్రజలు సుపరిపాలన అందించే నాయకులను ఎన్నుకోగలుగుతారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సామాన్యులు స్వయంగా, సులభంగా పొందగలిగిన రోజే నవ భారతానికి నాంది పడుతుందని ఈ వ్యాసం చెబుతుంది.

Comments

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

Comments are moderated. Please do not share personal or case details here; for advice on your matter, book a consultation.

Get the latest updates & legal knowledge

New articles, important court judgments and practical legal tips, explained in simple language and sent to you on WhatsApp.