More languages

Machine translation by Google, for convenience only. It may contain errors; the English and Telugu pages are the reliable versions.

News

Newspaper coverage, interviews, videos and articles.

Paper cutting ABN Andhra Jyothy

గుంజపడుగులో సింగరేణి భారీ బ్లాస్టింగ్‌పై కలెక్టర్, డీజీఎంఎస్‌లకు ఫిర్యాదు – Gunjapadugu Singareni Blasting Complaint

గుంజపడుగులో భారీ బ్లాస్టింగ్ వల్ల ఇళ్లలో తీవ్ర ప్రకంపనలు రావడంపై కలెక్టర్, డీజీఎంఎస్, టీఎస్‌పీసీబీ, సింగరేణి అధికారులకు ఫిర్యాదు చేసి, పీపీవీ నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరపాలని డిమాండ్ చేసిన గుంజపడుగు వాసి వినయ్ కుమార్.

Text of the cutting

కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం..
- వినయ్ కుమార్, గుంజపడుగు

బుధవారం జరిగిన భారీ బ్లాస్టింగ్‌తో గుంజపడుగులోని ఇండ్లలో తీవ్ర ప్రకంపనలు జరిగాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇంటి గోడలు, పైకప్పు, తలుపులు, కిటికీలు కంపించాయి. ఈ ఘటనపై కలెక్టర్, డీజీఎంఎస్, టీఎస్‌పీసీబీ తో పాటు సింగరేణి అధికారులకు ఫిర్యాదు చేశాం. పీపీవీ నిబంధనలకు లోబడి ఉందా లేదా అనేది కూడా నిర్ధారించాలని డిమాండ్ చేశాం.

Paper cutting Sakshi News

కవలలున్నారని ప్రసూతి సెలవు నిరాకరించరాదు: తెలంగాణ హైకోర్టు – Sakshi News

కవలల జననాన్ని రెండు ప్రసవాలుగా చూడరాదని, 'టూ చైల్డ్ నార్మ్' పేరుతో రెండో కాన్పునకు ప్రసూతి సెలవు నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు (జస్టిస్ కాజా శరత్) స్పష్టం చేసింది.

Text of the cutting

వలలున్నారని.. ప్రసూతి సెలవు నిరాకరించరాదు

సాక్షి, హైదరాబాద్: ఒకేసారి కవలలు జన్మించిన సందర్భాన్ని రెండు వేర్వేరు ప్రసవాలుగా పరిగణించరాదని, అది ఒకే ప్రసవంగా చూడాలని హైకోర్టు స్పష్టం చేసింది. 'టూ చైల్డ్ నార్మ్' పేరుతో మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవు నిరాకరించడం సరికాదని, అది రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. తొలిసారి ఇద్దరు పిల్లలు పుట్టినా రెండో కాన్పునకు కూడా 6నెలల ప్రసూతి సెలవు మంజూరు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుత కేసులో పిల్లలు ఒకరు పుట్టారా.. లేదా కవలలు జన్మించారా.. అన్నది మహిళ చేతిలో లేదని, ఇది జీవసంబంధమైన ప్రక్రియని వ్యాఖ్యానించింది. మొదటి కాన్పులో కవలలకు జన్మనిచ్చినందున రెండవ కాన్పునకు మహిళా ఉద్యోగి ప్రసూతి సెలవుకు అర్హురాలేనని చెప్పింది. పిటిషనర్‌కు ఆ మేరకు సెలవు మంజూరు చేయాలని, ఈ కాలానికి సంబంధించి పూర్తి వేతనం చెల్లించాలని గురుకుల సొసైటీని ఆదేశిస్తూ స్పష్టమైన తీర్పునిచ్చింది. రెండు కాన్పునకు ప్రసూతి సెలవును నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న స్వరూపారాణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కాజా శరత్ విచారణ చేపట్టారు.

జీవో 50.. మార్గదర్శకాలకు విరుద్ధం

పిటిషనర్ తరపు న్యాయవాది గట్టు వినయ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. 'పిటిషనర్ తొలి గర్భధారణలో కవలలు జన్మించారు. అనంతరం రెండోసారి గర్భవతి కావడంతో 180 రోజుల ప్రసూతి సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే తొలి కాన్పులోనే ఇద్దరు పిల్లలు పుట్టారని, ఆమెకు ఇప్పటికే ఇద్దరు సంతానం ఉన్నట్లేనంటూ అధికారులు ప్రసూతి సెలవును తిరస్కరించారు. కవలల జననం ఒకే గర్భధారణ ఫలితం. దానిని రెండు ప్రసవాలుగా పరిగణించడం చట్టవిరుద్ధం' అని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2014లో రాష్ట్ర ప్రభుత్వం జీవో 50 జారీ చేసిందని, ఈ నిబంధనల ప్రకారం ప్రసూతి సెలవు ఇద్దరు జీవించి ఉన్న పిల్లలకు వర్తిస్తుందన్నారు. పిటిషనర్‌కు ఇద్దరు పిల్లలున్నందున సెలవు నిరాకరించారని, జీవోకు విరుద్ధంగా సెలవు మంజూరు చేస్తే ఆడిట్ అభ్యంతరాలు, నిధుల దుర్వినియోగం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రసూతి సెలవులను సంక్షేమ దృక్పథంతో మహిళల హక్కులను పరిరక్షించేలా చూడాలని.. యాంత్రికంగా అమలు చేయరాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సుప్రీం, హైకోర్టుల మార్గదర్శకాలకు విరుద్ధంగా జీవో 50 ఉందన్నారు.

Paper cutting Times of india

Telangana HC Rules Twin Birth in First Pregnancy Cannot Bar Second Maternity Leave Under Two-Child Norm – Times of india

The Telangana High Court (Justice K. Sarath) rejected the state's "rigid" interpretation of the two-child norm and ruled that a woman government employee having twins in her first delivery cannot be denied 180 days of maternity leave with full pay and allowances for her second delivery.

Text of the cutting

Woman with twins in 1st pregnancy can't be denied maternity leave for second under 2-child norm: HC

Pinto.Deepak @timesofindia.com

Hyderabad: A govt employee cannot be denied maternity leave for her second pregnancy merely because she gave birth to twins in her first one, Telangana HC has held.

The ruling by Justice K Sarath came Wednesday on a petition filed by Jadi Swarupa Rani (35), a junior English lecturer at a govt college for girls in Mancherial district.

The petitioner had twins in 2023. When she gave birth to her third child in April 2026, college authorities rejected her maternity leave application. The administration argued that because her first pregnancy resulted in twins, she already had two surviving children, and this disqualified her for maternity leave under the state's "two-child norm".

Challenging this decision, the petitioner's counsel, Gattu Vinay Kumar, argued that the birth of twins was a biological event entirely beyond her control. "Denying maternity benefits for a subsequent pregnancy violates her fundamental rights," he contended.

The society governing the school opposed the petition citing service rules from 2010 and 2014, arguing that maternity leave was strictly limited only to married women employees with fewer than two surviving children.

"Since the petitioner already had two surviving children from her first delivery, she was not eligible for maternity leave for her second delivery," standing counsel Bhanothu Hussain contended, adding that such benefits, if sanctioned beyond eligibility, would result in undue financial burden on govt.

Rejecting the state's "rigid" stance, the HC held that the dispute was not about the existence of the rule itself, but rather its humane and sensible interpretation. "A literal interpretation would defeat the very objective of maternity leave, which is intended to protect the health of women and enable them to continue in employment," the judge said.

The judge further cited a precedent from Madras HC, noting that Tamil Nadu had amended its rules to specifically grant maternity leave for an additional delivery in such unique cases, while Andhra Pradesh subsequently removed the restriction on the number of surviving children altogether for availing maternity leave.

The judge concluded that the petitioner was fully entitled to maternity leave for her second pregnancy for 180 days from April 14, and directed the authorities to pay her full salary and allowances for the entire leave period.

Paper cutting Deccan Chronicle

Telangana High Court Rules Twin Birth in First Pregnancy Cannot Bar Second Maternity Leave – Deccan Chronicle

The Telangana High Court (Justice K. Sarath) ruled that a woman government employee cannot be denied maternity leave for her second pregnancy merely because her first delivery resulted in twins, directing authorities to grant full pay and allowances to Junior Lecturer Jadi Swarupa Rani.

Text of the cutting

HC: Twin birth cannot bar second maternity leave

VUJJINI VAMSHIDHAR | DC

HYDERABAD, JULY 15

The Telangana High Court has held that a woman government employee cannot be denied maternity leave for her second pregnancy merely because her first pregnancy resulted in twins.

The Court ruled that the expression "less than two surviving children" cannot be interpreted mechanically to deprive a woman of maternity benefits where twins were born in a single biological event.

Justice K. Sarath delivered the judgment while allowing a writ petition filed by Jadi Swarupa Rani, Junior Lecturer (English) in the Telangana Social Welfare Residential Educational Institutions Society, directing authorities to sanction maternity leave from April 14 to October 11, 2026, with full pay and allowances. Her first pregnancy in 2023 resulted in twins, for which she was granted 180 days' leave.

During her second pregnancy she sought another spell of leave, but authorities rejected it, contending she already had two surviving children under Rule 101(a) of the Telangana Fundamental Rules and G.O.Ms. No.50 dated May 17, 2014. She gave birth to her third child while the petition was pending.

The petitioner argued that twins should be treated as one delivery for maternity leave purposes. The State opposed, saying leave is restricted to women with fewer than two surviving children and sanctioning otherwise would invite audit objections.

Justice Sarath observed that the dispute was about interpretation in exceptional circumstances. He relied on Supreme Court rulings and noted maternity leave facilitates women's continued participation in the workforce. He said childbirth is a natural incident of life and cannot be treated as detrimental to employment.

The Court referred to judgments recognising that pregnancy's physiological and psychological consequences remain the same irrespective of order, and that a child's rights cannot be compromised merely because the mother already has two children.

Justice Sarath cited Tamil Nadu's 2018 amendment allowing leave for one additional delivery where twins are born first, and Andhra Pradesh's G.O.Ms. No.21 of May 5, 2025, which removed the restriction altogether.

He held that denying leave because the first pregnancy resulted in twins would defeat the purpose of maternity welfare legislation. He directed authorities to grant full pay and allowances for the entire period to the petitioner.

Paper cutting Eenadu

Telangana High Court Rules Maternity Leave Must Be Granted for Second Delivery Even If First Delivery Had Twins – Eenadu

The Telangana High Court ruled that denying 180 days of maternity leave for a second delivery because twins were born in the first delivery is unconstitutional, ruling in favor of SC Gurukul Junior Lecturer Jadi Swarooparani.

Text of the cutting

కవలలున్నా.. రెండో కాన్పునకూ సెలవు ఇవ్వాల్సిందే: హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్: మొదటి కాన్పులో కవలలు పుట్టారంటూ రెండో కాన్పునకు ప్రసూతి సెలవు నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు బుధవారం తేల్చి చెప్పింది. మొదటి కాన్పులో ఇద్దరు పిల్లలు పుట్టినా రెండో కాన్పునకు చట్టప్రకారం 180 రోజుల ప్రసూతి సెలవు మంజూరు చేయాల్సిందేనని స్పష్టంచేసింది. దీనిపై ఎస్సీ గురుకుల సొసైటీలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న జాడి స్వరూపరాణి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కె. శరత్ విచారణ జరిపి పై తీర్పు వెలువరించారు.

Open full size

Get the latest updates & legal knowledge

New articles, important court judgments and practical legal tips, explained in simple language and sent to you on WhatsApp.